AP NEWSRayalaseema News

చిత్తూరు జిల్లాలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

  • చిత్తూరు జిల్లాలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
    భాదితుల కథనం ప్రకారం..

తన ప్రేమను తిరస్కరించడంతో పాటు అడిగిన వెంటనే ఫోన్ నంబర్ ఇవ్వలేదన్న కారణంతో ఓ యువకుడు యువతి కుటుంబపై కాల్పులు జరిపాడు.

అడిగిన వెంటనే ఫోన్‌ నంబరు ఇవ్వలేదన్న కోపంతో పక్కింటి యువతిపై రెచ్చిపోయాడో సైకో. అమ్మాయిని బెదిరింపులకు గురిచేస్తూ గాల్లోకి తుపాకీ పేల్చి వీరంగం సృష్టించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పోలీసు స్టేషన్‌ పరిధిలో కడపనత్తం గ్రామానికి చెందిన చాంద్ బాషా అనే యువకుడు జులాయిగా తిరుగుతుంటాడు. పక్కింట్లో ఉండే యువతిపై మనసు పడి ప్రేమించాలంటూ వెంటపడేవాడు. ఆమె ఎన్నోసార్లు తిరస్కరించినా వినిపించుకోలేదు. తాజాగా ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ బాషా అడగ్గా యువతి నిరాకరించారు.

దీంతోపాటు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో యువతి తల్లి చాను ఇంటికెళ్లి అతడిని అందరి ముందు హెచ్చరించి వచ్చింది. అతడి ప్రవర్తన సరిగ్గా లేదని గ్రామ పెద్దలకు సైతం ఫిర్యాదు చేసింది. దీంతో బాషా ఆ కుటుంబంపై కక్షగట్టాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి నాటు తుపాకీతో వీధిలోకి వచ్చి వీరంగం చేశాడు. అతడి అరుపులకు భయపడిన యువతి కుటుంబం నిలదీయగా తుపాకీతో పేల్చాడు. బుల్లెట్ తలుపునకు తగిలి ధ్వంసమైంది. దీంతో భయాందోళనకు గురైన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.

అయితే ఈ విషయంపై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి అనంతరం డిఎస్పీ గంగయ్య మాట్లాడుతూ ఛాన్ బాషా కు భాదితురాలి బంధువుల అమ్మాయి తో వివాహం నిశ్చయం కాగా ఈ సంబంధం ఎలాగైనా జరగకుండా చేయాలని భాదితురాలి తల్లి ప్రయత్నిస్తుందని చెప్పిన చాంద్ భాష అన్నారు అయితే పెద్దల సమక్షంలో బాధితురాలి తల్లి తన మీద చెయ్యి చేసుకుందని అందువల్ల మనస్తాపంతో తో కోపంతో బాధితురాలిఅతని తల్లి పై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు అన్నారు

అయితే ముద్దాయి చాంద్ భాష కు సొంత తల్లిదండ్రులు గ్రామంలో ఇంట్లో చేర్చడం లేదని వేరే ఇంట్లో కాపురం ఉన్నాడని కొంత మంది చెప్పారు చాంద్ భాషా కు సొంత తల్లిదండ్రులు చేరుకోక పోవడంతో వేరే వాళ్ళతో వివాహం ఎలా నిర్ణయించారు అని బాధితురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ఏది ఏమైనప్పటికీ బాధితురాలు నాకు నా కూతురు ప్రాణహాని ఉందని ఏమైనా జరిగితే చాంద్ భాష కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది

desk news Administrator
Sorry! The Author has not filled his profile.
×
desk news Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

Comment here