Latest NewsSports

కోచ్‌గా ద్రవిడ్ సరిగ్గా సరిపోతాడు: ఇంజిమామ్

సీనియర్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్ పాత్రకు సరిగ్గా సరిపోతాడని, అతని మార్గ నిర్దేశంలో టీమిండియా రెండో టీమ్ అదరగొడుతుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ అన్నాడు. జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా రెండో జట్టుకు రాహుల్‌ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై ఇంజిమామ్ కూడా స్పందించాడు.

`కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ సరిగ్గా సరిపోతాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అండర్‌-19 టీమ్‌కు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్ ఎందరో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేశాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా రెండో జట్టులోఆడే ఆటగాళ్లలో చాలా మంది ద్రవిడ్‌ శిక్షణలో రాటుదేలిన వారే. వారికి ద్రవిడ్‌తో మంచి అనుబంధం ఉంది. వారి నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా రాబట్టాలో ద్రవిడ్‌కు తెలుస`ని ఇంజిమామ్ అన్నాడు.

admin Administrator
Sorry! The Author has not filled his profile.
×
admin Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here